పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ఎస్పీఎఫ్, పోలీసు కమ్యూనికేషన్స్, పోలీసు ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, ఫోరెన్సిక్ విభాగాల్లో కలిపి 2,050 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి పోస్టులతో పాటు సాంకేతిక, ఫోరెన్సిక్ విభాగాల్లోని ఉద్యోగాలు కూడా ఇందులో ఉన్నాయి.
అర్హత ఉన్న అభ్యర్థులు పోలీసు నియామక మండలి అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణ తేదీలు, ప్రాథమిక రాతపరీక్ష, తదుపరి ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నారు.
ఎంపిక విధానం పోస్టును బట్టి మారుతుంది. కానిస్టేబుల్, ఫైర్మెన్, జైలు వార్డర్, సివిల్ ఎస్సై, ఏఆర్ ఆర్ఎస్సై, ఎస్పీఎఫ్ ఎస్సై తదితర పోస్టులకు ప్రాథమిక రాతపరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారిని పీఎంటీ, పీఈటీ పరీక్షలకు పిలుస్తారు. శారీరక పరీక్షల్లో అర్హత సాధించిన వారికి తుది రాతపరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
పోలీసు కమ్యూనికేషన్స్ కానిస్టేబుల్, పీటీవో మెకానిక్, డ్రైవర్, కమ్యూనికేషన్స్, ట్రాన్స్పోర్ట్ విభాగాల ఎస్సై పోస్టులకు ప్రాథమిక రాతపరీక్ష ఉండదు. ఆయా పోస్టులకు నేరుగా శారీరక పరీక్షలు, అవసరమైన చోట ట్రేడ్టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి తర్వాత రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
కానిస్టేబుల్ పోస్టులకు విద్యార్హత పోస్టును బట్టి ఇంటర్మీడియట్ నుంచి ఐటీఐ వరకు ఉంది. సివిల్, ఏఆర్ కానిస్టేబుల్, ఫైర్మెన్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అవసరం. పోలీసు కమ్యూనికేషన్స్, పీటీవో మెకానిక్, డ్రైవర్ పోస్టులకు నిర్దిష్ట సాంకేతిక అర్హతలు, ఐటీఐ సర్టిఫికెట్లు అవసరం.
ఎస్సై పోస్టులకు సాధారణంగా డిగ్రీ అర్హత ఉండాలి. పోలీసు కమ్యూనికేషన్స్ ఎస్సై పోస్టులకు ఈఈఈ, ఈసీఈ, సీఎస్ఈ, ఐటీ వంటి సాంకేతిక విద్యార్హతలు అవసరం. పోలీసు ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్సై పోస్టులకు ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్లో డిప్లొమా అర్హతగా పేర్కొన్నారు.
కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు వయోపరిమితిలోనూ సడలింపు కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఐదేళ్ల వయోసడలింపు ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు పోస్టుల వారీగా విద్యార్హత, వయసు, శారీరక ప్రమాణాలు, పరీక్ష విధానం వంటి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో తప్పనిసరిగా పరిశీలించాలి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews














