నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భువన్, శ్రీకర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నభా నటేశ్, సంయుక్త హీరోయిన్లుగా నటిస్తుండగా ఠాగూర్ మధు ఈ సినిమాను సమర్పిస్తున్నారు.
సోమవారం నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం కొత్త పోస్టర్‌తో పాటు ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో సినిమా కోసం నిఖిల్ వియత్నాంలో చేసిన కత్తియుద్ధం, సాఫ్ట్ కాంబాట్, మార్షల్ ఆర్ట్స్ శిక్షణకు సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం ఆయన తీసుకున్న కఠిన శిక్షణ, విరోచిత విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
చారిత్రక నేపథ్యంతో యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నిఖిల్ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్ అందిస్తుండగా, ఛాయాగ్రహణ బాధ్యతలను కె.కె. సెంథిల్ కుమార్ నిర్వహిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















