ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ అమెరికాలో భారీ ఐపీఓకు సిద్ధమవుతోంది. ఈ ఐపీఓ ద్వారా సంస్థ దాదాపు 75 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7.27 లక్షల కోట్లు) సమీకరించనుంది. కంపెనీ మొత్తం విలువను 1.75 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.167 లక్షల కోట్లు)గా అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు సౌదీ ఆరామ్‌కో 2019లో సమీకరించిన 29.4 బిలియన్ డాలర్ల ఐపీఓనే అత్యంత పెద్దదిగా ఉండగా, స్పేస్‌ఎక్స్ ఆ రికార్డును భారీగా అధిగమించనుంది.
ఈ ఐపీఓపై ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా భారతీయ మదుపర్లు ఇందులో పాల్గొనగలరా అన్న ప్రశ్నకు కూడా సమాధానం వెలుగులోకి వచ్చింది.
భారతీయులకు అవకాశం ఎలా అంటే..
స్పేస్‌ఎక్స్ షేర్లను భారతీయులు నేరుగా ఐపీఓ సమయంలో కొనుగోలు చేయడం సాధ్యం కాదు. అయితే కంపెనీ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన తర్వాత సెకండరీ మార్కెట్ల ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇది ఆర్‌బీఐ అమలు చేస్తున్న లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) కింద మాత్రమే సాధ్యం. ఈ స్కీమ్ ప్రకారం భారతీయ నివాసితులు ప్రతి ఆర్థిక సంవత్సరానికి గరిష్ఠంగా 2,50,000 డాలర్లు (సుమారు రూ.2.42 కోట్లు) వరకు విదేశీ పెట్టుబడులు పెట్టవచ్చు. ఇందుకు అంతర్జాతీయ బ్రోకరేజీ ప్లాట్‌ఫార్మ్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది.
ఐపీఓ ముఖ్య వివరాలు ఇలా ఉన్నాయి:
లిస్టింగ్ తేదీ: జూన్ 12
షేర్ ఇష్యూ ధర: 135 డాలర్లు (సుమారు రూ.11,000)
మొత్తం షేర్లు: 55.56 కోట్లు
సమీకరించనున్న నిధులు: 75 బిలియన్ డాలర్లు
ట్రేడింగ్ వేదిక: నాస్‌డాక్ (టికర్: SPXCX)
అందుబాటు: ఎంపిక చేసిన అమెరికన్ బ్రోకరేజీల ద్వారా మాత్రమే
ఈ ఐపీఓ పూర్తయితే ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద పబ్లిక్ ఇష్యూలలో ఒకటిగా నిలవనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















