తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన వార్షిక క్రికెట్ టోర్నమెంట్ ‘తాల్ ప్రీమియర్ లీగ్ (TPL) 2026’ ఘనంగా ముగిసింది. 14 వారాల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ టోర్నమెంట్‌కు ఆగస్టు 16న ఇంగ్లాండ్‌లోని లాంగ్లీ, స్లౌ క్రికెట్ క్లబ్‌లో నిర్వహించిన మెగా ఫైనల్స్‌తో తెరపడింది.
ఫైనల్ పోరులో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఐటీ ట్రీ వారియర్స్ TPL 2026 ఛాంపియన్స్‌గా నిలిచింది. గట్టి పోటీ ఇచ్చిన సూపర్ స్టార్స్ రన్నరప్‌గా నిలవగా.. వైజాగ్ బ్లూస్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ సీజన్‌లో మొత్తం 10 జట్లు పాల్గొని 51 మ్యాచ్‌లు ఆడాయి. 200 మందికి పైగా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు.
విజేతలకు పురస్కారాలు :
టీపీఎల్ మెగా ఫైనల్స్‌కు పార్లమెంట్ మాజీ సభ్యుడు వీరేంద్ర శర్మ ముఖ్య అతిథిగా హాజరై విజేతలు, రన్నరప్ జట్లకు బహుమతులు అందజేశారు. యూకేలోని భారతీయ సమాజానికి TAL అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు. సుదీర్ఘకాలంగా యూకేలోని కమ్యూనిటీకి సేవలందిస్తున్న సంస్థల్లో TAL ఒకటని పేర్కొన్నారు.
TPL 2026 ఛాంపియన్: ఐటీ ట్రీ వారియర్స్
కెప్టెన్: ఆకాశ్ బండారి | ఫ్రాంచైజీ యజమాని: వికాస్ పర్రే
రన్నరప్: సూపర్ స్టార్స్
కెప్టెన్: కృష్ణ అల్ల | ఫ్రాంచైజీ యజమాని: వేణు నవులూరి
మూడో స్థానం: వైజాగ్ బ్లూస్
కెప్టెన్: శ్రీనివాస్ సురభి | ఫ్రాంచైజీ యజమాని: రవి బండారు
ఫెయిర్ ప్లే అవార్డు: డీజే వారియర్స్
కెప్టెన్: సాయి అమృత్ రెడ్డి వెన్న | ఫ్రాంచైజీ యజమాని: శ్రీనివాస్ రెడ్డి చెరుకు
మ్యాన్ ఆఫ్ ది సిరీస్: ధనంజయ మద్దుకూరి – ఐటీ ట్రీ వారియర్స్
ఉత్తమ బౌలర్: ధనంజయ మద్దుకూరి – ఐటీ ట్రీ వారియర్స్
ఉత్తమ బ్యాటర్: ఆకాశ్ బండారి – ఐటీ ట్రీ వారియర్స్
ఉత్తమ ఫీల్డర్/కీపర్: సాయి అమృత్ రెడ్డి వెన్న – డీజే వారియర్స్
క్రికెట్‌తో పాటు వినోద కార్యక్రమాలు :
మెగా ఫైనల్స్ సందర్భంగా దాదాపు 300 మందికి పైగా పిల్లలు, పెద్దలు పాల్గొని సందడి చేశారు. భారత్, యూకే జాతీయ గీతాలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. క్రికెట్ పోటీలతో పాటు పిల్లలు, కుటుంబ సభ్యుల కోసం వివిధ ఆటలు, వినోద కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
TAL క్రికెట్ ప్రయాణం 2008లో ప్రారంభమై.. 2012లో తాల్ ప్రీమియర్ లీగ్‌గా రూపాంతరం చెందిందని అసోసియేషన్ ఛైర్మన్ రవి సబ్బ తెలిపారు. ప్రస్తుతం TPL యూరప్‌లో కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించే అతిపెద్ద టీ20 క్రికెట్ లీగ్‌గా ఎదిగిందని, యూకే వ్యాప్తంగా తెలుగు కుటుంబాలను మరింత దగ్గర చేస్తోందని పేర్కొన్నారు.
టోర్నమెంట్ విజయవంతానికి కృషి చేసిన స్పోర్ట్స్ ఇన్‌ఛార్జి సింధూర చెరకు, స్పోర్ట్స్ ట్రస్టీ సత్య పెద్దిరెడ్డిలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే TPL కమిటీ సభ్యులు హర్ష కాగితాల, శరత్ పుట్ట, ట్రస్టీలు సత్య పెద్దిరెడ్డి, కిరణ్ కప్పెట, అనిల్ అనంతుల, అశోక్ మాడిశెట్టి, రవి మోచర్ల, వెంకట్ నేలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లకు కూడా TAL ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
‘1 Million Steps Challenge’కు విశేష స్పందన :
క్రీడా కార్యక్రమాలతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించే మరో కార్యక్రమాన్ని కూడా TAL నిర్వహించింది. ప్రజలు నడక, వ్యాయామాన్ని రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతో **‘TAL 1 Million Steps Challenge’**ను చేపట్టింది.
100 రోజుల్లో 10 లక్షల అడుగులు లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం మే 7 నుంచి ఆగస్టు 15, 2026 వరకు కొనసాగింది. కమ్యూనిటీ నుంచి దాదాపు 80 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి నాయకత్వం వహించిన వెంకట్ తోటకూర, శ్రీహరి అరిగె, సునీత అరిగెతో పాటు పాల్గొన్న వారికి పతకాలు అందజేశారు.
క్రికెట్, ఆరోగ్యం, కుటుంబ వినోదం, కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని కలగలిపిన ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ TAL ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















