తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. వైఖానస ఆగమ సంప్రదాయాలను అనుసరించి జరిగిన ఈ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టారు.
అంకురార్పణలో భాగంగా శ్రీవారి సేనాధిపతి శ్రీ విష్వక్సేనులవారు ఆలయంలోని నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఆలయ యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు.
వైఖానస ఆగమంలో అంకురార్పణకు అత్యంత ప్రాధాన్యం ఉంది. విత్తనాలు మొలకెత్తే ప్రక్రియను అంకురార్పణగా పేర్కొంటారు. బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరగాలని సంకల్పించడంతో పాటు, స్వామివారి అనుగ్రహాన్ని కోరుతూ ఈ ఘట్టాన్ని నిర్వహిస్తారు.
మంగళవారం సాయంత్రం 6.21 గంటల నుంచి 6.35 గంటల మధ్య మీనలగ్నంలో శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















