హైదరాబాద్: ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (AIDC)లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన సందర్భంలో సమయపాలన పాటించని సిబ్బందిపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తమైంది. భవనాల నిర్వహణలో లోపాలు, క్రమశిక్షణ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సమయపాలనను పాటించని అధికారులపై సరికొత్త చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
ఈ తనిఖీలు సిబ్బందిని క్రమశిక్షణ పాటించడానికి మార్గదర్శకంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.




















