స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు షాక్ :
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు వివో, శాంసంగ్ తమ కొన్ని మోడళ్ల ధరలను పెంచాయి. మెమొరీ చిప్‌ల ధరలు పెరగడంతో తయారీ సంస్థలపై వ్యయభారం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ధరల సవరణ చేపట్టినట్లు తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ ధరలను గరిష్ఠంగా రూ.12 వేల వరకు పెంచగా.. వివో టీ5 ప్రో ధరలను రూ.7 వేల వరకు పెంచింది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 :
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ ధరలను తాజాగా సవరించింది. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర గతంలో రూ.80,999 ఉండగా.. రూ.4 వేల పెంపుతో రూ.84,999కు చేరింది.ఇక 12GB + 512GB వేరియంట్ ధర రూ.92,999 నుంచి ఏకంగా రూ.1,03,999కు పెరిగింది. ఈ వేరియంట్‌పై రూ.11 వేల పెంపు నమోదైంది. సవరించిన ధరలు అమల్లోకి వచ్చాయి.
వివో టీ5 ప్రో కూడా ఖరీదు:
వివో తన టీ5 ప్రో స్మార్ట్‌ఫోన్ ధరలను కూడా పెంచింది. 8GB + 128GB బేస్ వేరియంట్‌పై రూ.6 వేల పెంపు చేపట్టడంతో ధర రూ.41,999కు చేరింది.8GB + 256GB వేరియంట్ ధర రూ.7 వేల పెంపుతో రూ.46,999కు చేరింది. ఇక 12GB + 256GB వేరియంట్ ధర రూ.69,999గా ఉంది.
చిప్‌ల ధరల ప్రభావం :
ప్రపంచవ్యాప్తంగా మెమొరీ చిప్‌ల ధరల్లో పెరుగుదల స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలపై ప్రభావం చూపుతోంది. ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో కొన్ని కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపైకి మళ్లిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో మరికొన్ని స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలు కూడా సవరించే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు ప్రస్తుత ధరలు, ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews
















