‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంలో చిరంజీవి మేనకోడలు నైరా ఆలపించిన ‘ఫ్లై.. హై’ వీడియో సాంగ్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాట ప్రోమో రిలీజ్ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి, ఈ గీతాన్ని చిరు సోదరి మాధవి కుమార్తె నైరా పాడిందని వెల్లడించారు. చిరంజీవి కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైన నాటి నుంచే వరుస రికార్డులను నమోదు చేస్తోంది. తాజాగా 2026లో ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచి మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది.



















