తేదీ: 23-10-2025
తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ గురువారం కూడా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనార్థం తిరుమలను సందర్శిస్తున్నారు.
ఉచిత దర్శనం కోసం భక్తులు ప్రస్తుతం 21 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం సుమారు 18 గంటల సమయం పడుతోంది. రూ.300 శీఘ్రదర్శనం కోసం వచ్చిన భక్తులు 2 నుండి 4 గంటలలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. సర్వదర్శన టోకెన్ పొందిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతోంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 73,853, తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 22,551గా తితిదే అధికారులు వెల్లడించారు.
హుండీ ద్వారా స్వామివారి ఆలయానికి వచ్చిన ఆదాయం ₹3.47 కోట్లుగా నమోదైంది.
తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు అదనపు ఏర్పాట్లు చేపడుతూ, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఓం నమో వేంకటేశాయ




















