రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ద్వారా పరిశ్రమలు ప్రారంభించే వారికి వివిధ బ్యాంకులు మద్దతు ఇస్తున్నట్టు బ్యాంకర్ల ప్రతినిధులు వెల్లడించారు. అమరావతిలోని ప్రధాన హబ్‌కు యూనియన్ బ్యాంక్, రాజమండ్రి స్పోక్ హబ్‌కు ఎస్బీఐ–బ్యాంక్ ఆఫ్ బరోడా, అనంతపురానికి కెనరా బ్యాంక్, విశాఖకు పీఎన్బీ, తిరుపతికి ఇండియన్ బ్యాంక్, విజయవాడకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సహకరిస్తున్నట్టు తెలిపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ క్రెడిబులిటీ, బ్రాండింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. రుణాల రీషెడ్యూలింగ్‌తో పెద్ద మొత్తంలో ఆదా జరిగిందని, ప్రకృతి సేద్యం, బలహీన వర్గాల ఎంఎస్ఎంఈలకు బ్యాంకర్ల సహకారం అవసరమని సూచించారు. వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్‌ప్రెన్యూర్, సర్వీస్ సెక్టార్ అభివృద్ధి, పీపీపీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టామని తెలిపారు.


















