ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అధికారుల బదిలీలతో సంచలనం సృష్టించింది. ఒకే సారి రాష్ట్రవ్యాప్తంగా 31 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో పలువురు డైరెక్టర్లు, కార్యదర్శులు, సబ్‌కలెక్టర్లు కూడా ఉన్నారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న కొంతమంది అధికారులకు ఇప్పుడు బాధ్యతలు లభించగా, మరికొందరిని కొత్త విభాగాలకు మార్చారు. గతంలో జరిగిన కలెక్టర్ల బదిలీలతో పోలిస్తే ఈసారి మరింత విస్తృతంగా మార్పులు చోటు చేసుకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే కేవీఎన్ చక్రధర్ బాబు వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. మంజీర్ జిలానీకి ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా, అలాగే మార్క్‌ఫెడ్ ఎండీగా కూడా బాధ్యతలు అప్పగించారు. రవి సుభాష్‌ను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా నియమించారు. శివశంకర్ ఏపీఎస్పీడీపీఎస్ ఎండీగా నియమితులయ్యారు. వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా ఉన్న ఢిల్లీ రావు ఇప్పుడు పౌర సరఫరాల కార్పొరేషన్ ఎండీగా మారారు.
ఇంటర్ బోర్డు డైరెక్టర్‌గా రంజిత్ బాషా, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా అరుణ్ బాబు, సీసీఎల్ఏ అదనపు కార్యదర్శిగా జేవీ మురళి, సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శిగా చేతన్ నియమితులయ్యారు. వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా నవ్య, ఎయిర్‌పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య, సమాచారశాఖ డైరెక్టర్‌గా కేఎస్ విశ్వనాథన్, పౌరసరఫరాలశాఖ డైరెక్టర్‌గా గోవిందరావు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎస్సీ కమిషన్ కార్యదర్శిగా చిన్న రాముడు, ట్రాన్స్‌కో జేఎండీగా ప్రవీణ్ చంద్ నియమితులయ్యారు.
ఇక జిల్లా స్థాయిలో కూడా పలు మార్పులు జరిగాయి. బాపట్ల జేసీగా భావన, నంద్యాల జేసీగా కార్తీక్, ఏలూరు జేసీగా అభిషేక్ గౌడ్, కర్నూలు జేసీగా నూరుల్ కామర్, కాకినాడ జేసీగా అపూర్వ భరత్, సత్యసాయి జిల్లా జేసీగా మౌర్య భరద్వాజ్, అల్లూరి సీతారామరాజు జిల్లా జేసీగా శ్రీపూజ నియమితులయ్యారు.
రాజమండ్రి మునిసిపల్ కమిషనర్‌గా రాహుల్ మీనా, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌గా శుభం బన్సల్, వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ సెక్రటరీగా శోభిక, హౌసింగ్ శాఖ కార్యదర్శిగా వెంకట్ త్రివినాగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అదనంగా, లిడ్‌క్యాప్ వీసీ & ఎండీగా ప్రసన్న వెంకటేష్, శాప్ ఎండీగా భరణి, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా మురళీధర్, మారిటైమ్ ఇన్‌ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా అభిషేక్ కుమార్ నియమితులయ్యారు.
మొత్తం గా, ఈ బదిలీలతో ఏపీ పాలన వ్యవస్థలో కొత్త శక్తి, కొత్త సమీకరణాలు నెలకొన్నట్లు కనిపిస్తోంది.



















