విజయవాడలో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ – ఐరాస పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన పుస్తకం ఆవిష్కరణ – ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపముఖ్యమంత్రి పవన్ – విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం – కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
పుస్తకాలు తనపై చాలా ప్రభావం చూపాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఐరాస పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్.. పుస్తకాన్ని ఆవిష్కరించారు.
‘‘మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలి. ఏ విషయంలోనైనా సమతుల్యత పాటించాలి. నా ఆలోచనలను ఇతరులతో పంచుకుంటా. ఒక్కో పుస్తకం చదువుతుంటే ఎన్నో అంశాలు నేర్చుకుంటాం’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.



















