హైదరాబాద్, అక్టోబర్ 17: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నేడు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆయన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. నామినేషన్ ప్రక్రియ అనంతరం నవీన్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల మద్దతుతో జూబ్లీహిల్స్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం తన ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.


















