ఇంటర్నెట్ డెస్క్: టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ‘ఫిట్‌నెస్’ అంశంపై చర్చ మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది. తాను పూర్తిగా ఫిట్‌గా ఉండి బౌలింగ్ చేస్తున్నానని షమీ చెబుతుండగా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం “షమీ ఫిట్‌నెస్‌పై ఎలాంటి అప్‌డేట్ లేద”ని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలతో అసంతృప్తి వ్యక్తం చేసిన షమీ సోషల్ మీడియాలో స్పందించి పరోక్షంగా విమర్శలు చేశాడు.
తాజాగా అగార్కర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “ఎవరైనా నాతో నేరుగా మాట్లాడవచ్చు, నా ఫోన్ ఎప్పుడూ ఆన్‌లో ఉంటుంది” అని చెప్పారు. షమీ కూడా తనతో నేరుగా మాట్లాడితే మంచిదని సూచించారు. దీనిపై షమీ ప్రతిస్పందిస్తూ, “నా బౌలింగ్ మీరు చూశారు కదా.. ఫిట్‌నెస్ గురించి ఇక ఏమి చెప్పాలి?” అంటూ తన వైఖరిని స్పష్టం చేశాడు.




















