విశాఖపట్నం వాతావరణ కేంద్రం తాజా అంచనాల ప్రకారం, మరో మూడు గంటల్లో గాజువాక, పూడిమడక, అచ్చుతాపురం పరిసర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈదురుగాలుల ప్రభావం దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించింది. తాత్కాలికంగా వర్షం పడే అవకాశమూ ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.



















