మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 ఎంతో ఉత్కంఠభరితంగా ముందుకు సాగుతోంది. లీగ్ దశ చివరకు చేరుతున్న వేళ, ఇప్పటికే మూడు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించగా, నాలుగో స్థానం కోసం పోటీ తారాస్థాయికి చేరింది. ఇదే సమయంలో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి కీలక సమాచారం బయటకు వచ్చింది.
🏟️ ఫైనల్ భారత్‌లోనే.. పాక్ నిష్క్రమణతో మారిన ప్రణాళిక
ఐసీసీ తాజా ప్రకారం, మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ నవీ ముంబయిలో జరగనుంది. మొదట పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంటే మ్యాచ్‌ను న్యూట్రల్ వేదికగా కొలంబోలో నిర్వహించాలనే యోచనలో ఉన్న ఐసీసీ, ఇప్పుడు ఆ అవసరం తీరిపోయిందని తెలిపింది. లీగ్ దశలోనే పాక్ టోర్నీ నుంచి తప్పుకున్న కారణంగా ఫైనల్‌ను భారత్‌లోనే నిర్వహించేందుకు వీలైంది.
సెమీఫైనల్‌లకు సంబంధించి:
- మొదటి సెమీఫైనల్ (అక్టోబర్ 29): వేదిక ఇంకా ఖరారు కాలేదు, ఇందౌర్ అవకాశం
- రెండో సెమీఫైనల్ (అక్టోబర్ 30): నవీ ముంబయి వేదికగా జరుగనుంది




















