కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బస్సులో 39 పెద్దవాళ్లు, 4 చిన్నపిల్లలు మరియు 2 గుర్తుతెలియని వ్యక్తులు ఉన్నారని సమాచారం. గుర్తుతెలియని వ్యక్తులలో ఒకరు అరాంఘర్ చౌరస్తాలో బస్సులో ఎక్కిన తర్వాత దిగిపోయారు.
ఈ ప్రమాదంలో 23 పెద్దవాళ్లు, 2 పిల్లలు మరియు 2 డ్రైవర్లు బద్ధగా బయటపడ్డారు. డ్రైవర్లతో సహా మొత్తం 27 మంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. గాయపడ్డ వారిలో 6 మంది కర్నూలు జీజీహెచ్‌లో, 3 మంది ఆకాష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదంలో మరణించిన 19 మందిలో 2 పిల్లలు ఉన్నారు. మృతులలో 6 మంది ఆంధ్రప్రదేశ్, 6 మంది తెలంగాణ, 1 ఒడిశా, 1 బీహార్ వాసి, అలాగే మరో మృతదేహాన్ని గుర్తించాల్సివుంది. ఆంధ్రప్రదేశ్‌లో బాపట్ల జిల్లా వాసి ధాత్రి, కోనసీమ జిల్లా వాసి శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 4 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదానికి సంబంధించిన కేసు నమోదు చేసి పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించినట్లుగా, ఏపీ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడినవారికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని తెలిపారు. అలాగే ప్రమాదంపై పూర్తి విచారణ కోసం ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేయనున్నారు.



















