భారీ వర్షాల కారణంగా పులిచింతల రిజర్వాయర్‌కు వరద ఇన్‌ఫ్లో గణనీయంగా పెరుగుతోంది. రాబోయే గంటల్లో ఇన్‌ఫ్లో సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా రిజర్వాయర్ నుంచి 4.9 లక్షల నుంచి 5.5 లక్షల క్యూసెక్కుల వరకు నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
దీని ప్రభావంగా ప్రకాశం బ్యారేజ్ నుండి కూడా వరద నీరు దిగువప్రాంతాలకు విడుదల చేయబడనుంది. దీనివల్ల నది పరివాహక ప్రాంతాల్లో నీటి మట్టం పెరిగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైనచోట రక్షణ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.



















