తిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడికి రథోత్సవం నిర్వహించారు. మహోన్నత రథంపై శ్రీవారు భక్తులకు అభయప్రదానం చేశారు. రథోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో తిరుమాడ వీధులు కిక్కిరిసిపోయాయి.



















