కాళేశ్వరం ప్రాజెక్ట్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజిలను మరమత్తు చేయాలని నిర్ణయం తీసుకుంది.
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజిలను మరమత్తు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పునరుద్ధరణ డిజైన్ల కోసం టెండర్లకు ఆహ్వానం పలికింది. NDSA కమిటీ దర్యాప్తు ఆధారంగా రిహాబిలిటేషన్, రిపోర్టేషన్ డిజైన్లు చేయనుంది. డిజైన్ల కోసం అక్టోబర్ 15 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు విధించింది. కాగా అసెంబ్లీ ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజి కుంగిన సంగతి తెలిసిందే.
సీబీఐ చేతిలో..
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ సర్కార్ విచారణకు ఒక కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఇటీవల విచారణ ముగించిన ఘోష్ కమిషన్.. ప్రభుత్వానికి దాదాపు 600 పేజీలతో అందించింది. కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. నివేదిక ఆధారంగా కాళేశ్వరం స్కామ్ పై విచారణను సీబీఐ అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విచారణను టేకప్ చేసిన సీబీఐ.. విచారణను ప్రారంభించింది. ఈ కేసులో విచారణలో భాగంగా FIR నమోదు చేసిన సీబీఐ.. త్వరలో కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేంద్రతో సహా అధికారులను విచారిస్తుందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా ఎక్కడ సీబీఐ అధికారిక ప్రకటన చేయలేదు


















