శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తిక మాసం. ఈ మాసానికి సమానమైనది మరొకటి లేదని, గంగకు సమానమైన తీర్థం లేదని పురాణాలు చెబుతున్నాయి. అపారమైన పుణ్యఫలాలను అందించే ఈ పవిత్ర మాసంలో దీపారాధనకు ఉన్న ప్రాధాన్యం అత్యంత విశిష్టమైనది.
ఈ నేపథ్యంలో ‘ఈటీవీ ఆంధ్రప్రదేశ్’, ‘ఈటీవీ తెలంగాణ’, ‘ఈటీవీ లైఫ్’ ఛానళ్ల సంయుక్త ఆధ్వర్యంలో కార్తిక దీపోత్సవం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలకు పూజా సామగ్రి నిర్వాహకులచే అందించబడుతుంది.
ఎంట్రీ పాస్‌లు శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కళాశాల మైదానంలో పంపిణీ చేస్తారు. పాస్‌లు పరిమిత సంఖ్యలో మాత్రమే లభ్యమవుతాయి. చిన్నపిల్లలకు ప్రవేశం ఉండదు. నేలపై కూర్చోగలిగే వారు మాత్రమే హాజరు కావాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.




















