భర్త, కుమారుడిని కోల్పోయిన ఆదిలక్ష్మికి ఇన్నాళ్లూ ఓ ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఆమె కోడలే. అత్తను తల్లి లాగా చూసుకున్న శ్రీదేవి, ఆమె చివరి క్షణాల వరకు పక్కనుండి సేవచేసింది. ఆదివారం ఆదిలక్ష్మి అకస్మాత్తుగా మరణించగా, కుటుంబంలో మగవారు ఎవరూ లేకపోవడంతో కోడలే ఆచారప్రకారం తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ హృదయవిదారక సంఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లిలో చోటుచేసుకుంది. అత్తపైన కోడలు చూపిన ప్రేమ, బాధ్యత స్థానికుల హృదయాలను తాకింది.



















