విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలోని సీతారామాలయంలో శనివారం రాత్రి గౌరీ–పరమేశ్వరుల కళ్యాణం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో గ్రామస్థులు వివిధ రకాల పిండివంటలు, మిఠాయిలు, పళ్లు, కొబ్బరికాయలతో 300 పళ్లాల సారెను ఊరేగించి శివయ్యకు సమర్పించారు.




















