రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు రైతుల త్యాగంతోనే రాజధాని అమరావతి నిర్మాణం సాధ్యమైందని. తుళ్లూరులో డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ —
“కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. పోలీసు శాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. వారి ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తాం. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను తిప్పికొడతాం. పోలీసులపై తప్పుడు ప్రచారాన్ని అస్సలు సహించం. సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులను సహించబోం. పోలీసులకు ఆధునిక సాంకేతికతను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం 6,100 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది,” అని మంత్రి అనిత తెలిపారు.



















