ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోన జలపాతం ఇప్పుడు కొత్త అందాలతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. కొండచరియలపై నుంచి కురుస్తున్న నీటిధారలు చూడచక్కగా మెరిసిపోతున్నాయి. జిల్లా కేంద్రానికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సహజ సోయగాలతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడకు తరలివస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా భైరవకోనలో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. శ్రీ త్రిముఖ దుర్గాంబాదేవి దర్శనంతో భక్తులు తమ కోరికలు తీర్చుకుంటున్నారు.



















