దానాలలో కన్యాదానం అత్యంత మహత్తరమైనది. జీవాన్ని ఇచ్చి, ప్రేమతో పెంచి, విద్యాబుద్ధిని ఇచ్చి, బాధల హృదయంతో కూతుర్ని వరునికి అప్పగించడంలో ఒక గొప్ప త్యాగం ప్రతిఫలిస్తుంది.
లక్ష్మీ స్వరూపమైన ఆ కన్య మరొక వంశాన్ని ఉద్భవించడానికి గృహప్రవేశం చేస్తుంది. హిందూ సమాజంలో వివాహం ఒక గొప్ప సంస్కారం.
సనాతన వేద సంప్రదాయంలో వివాహం మానవులకోసం ఇచ్చిన ఒక మహత్తర ఆజ్ఞ. వివాహం ద్వారా కుటుంబం ఏర్పడింది. కుటుంబం మన దేశానికి మూలాధారం. కలసి ప్రేమ, అనురాగాలను పంచుకునేది కుటుంబమే. కుటుంబ భావన వసుధా ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
మానవజన్మ షోడశ సంస్కారాలతో ప్రారంభమవుతుంది. మొదటిది గర్భాదానం, చివరది అంత్యేష్టి. గర్భాదానానికి నాంది హిందూ వివాహం. ఇది కేవలం శారీరక కలయిక కాదు, తల్లిదండ్రులకు, భగవంతునికి కృతజ్ఞతగా మరొక జీవికి పవిత్ర మార్గం కల్పించడం.
హిందూ వివాహం మంత్రపూరిత, బీజాక్షరసహితమైన అద్భుత తంతు. వధూ-వరుల చేత పురోహితుడు నిర్వర్తించే మహిమాన్విత కార్యం. వారికి ప్రతి దశలో అర్థం, భావం తెలియజేస్తూ సాగించే మధురమైన జీవిత ఘట్టం.
మన సనాతనం అష్టవిధ వివాహాలను సూచిస్తుంది. మానవులకు అర్హమైనవి మూడు: ఆర్ష, దైవ, బ్రహ్మ.
- పార్వతీపరమేశ్వరుల కళ్యాణం
- శ్రీనివాసుని నిత్యకళ్యాణం
- శ్రీ సీతారాముల జగత్ కళ్యాణం
హిందూ వివాహాలు ప్రధానంగా బ్రహ్మ, ఆర్ష పద్ధతిలో కొనసాగుతున్నాయి. ఆర్ష పద్ధతిలో గోపూజ ఉంటుంది. లక్ష్మీ స్వరూపం కన్యను, విష్ణు స్వరూపం వరుని ఇచ్చి కన్యాదానం చేస్తారు. పాణిగ్రహణం ద్వారా కళ్యాణం సంపూర్ణం.
వివాహానంతరం వరుడు గృహస్థుడు, వధువు గృహిణిగా జీవిస్తారు. గృహస్థాశ్రమం సకల ఆశ్రమాలకు ఆశ్రయం. కుటుంబ ఆశలు, సంతోషాలు, కష్టసుఖాలను పంచుకునే దేవాలయం.
సప్తపది ద్వారా వధూవరుల జీవిత యాత్రకు వేద మంత్రాలు జీవన సౌరభంగా ముద్రింపబడతాయి.
- వరుడు: “ధర్మేచ్, అర్థేచ్, కామేచ్, నాతి చరామి”
- వధువు: “ధర్మేచ్, అర్థేచ్, కామేచ్, తుభ్యం….”
సప్తపది ద్వారా వివాహం పరిపూర్ణమవుతుంది. ఇది ఒక సామాజిక, ధార్మిక, ఆధ్యాత్మిక బంధం.
హిందూ వివాహం ఒక నిర్దిష్ట సూత్రంతో, జీవిత సత్యాన్ని, ఆనందాన్ని, కుటుంబ విధులను చూపే మహత్తర కార్యం. పాశ్చాత్యులు కూడా ఆకర్షితులవుతుంటారు, కానీ యువతలో అర్థం లేకపోవడం, వివాహాన్ని కేవలం సంపాదనగా భావించడం సమస్య.
ఆర్థిక స్వావలంబన అవసరం, కానీ దానితోనే దాంపత్య ఫలాలను ఆస్వాదించడం లేదు. పాశ్చాత్య ప్రభావం, ప్రేమానురాగ కంటే స్వార్థ భావన పెరుగుతోంది. ధర్మార్థ సాధనతో సంపదను పెంచడంలో తప్పలేదు, కానీ ఆప్యాయతను, ప్రేమను కుటుంబంలో పంచుకోవడం ముఖ్యం.
యువతీయువకులు వ్యక్తిత్వాన్ని పవిత్రంగా ఉంచి, వివాహం ద్వారా ఒక్కటవ్వడం, చిన్న కోపాలను అధిగమించి ఆనందంగా జీవించడం, వృద్ధుల మాటలకు విలువనిచ్చి తదుపరి తరాలకు ఆదర్శంగా నిలవడం అవసరం.
మన భారతీయ సంస్కృతిలో హిందూ వివాహ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం.
సర్వం శ్రీకృష్ణార్పణమస్త్ 🙏



















