అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్’కి కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. 2026 ఉగాది సందర్భంగా మార్చి 19న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. అడివి శేష్ తన సోషల్ మీడియా అకౌంట్లో సంబంధిత పోస్టర్‌ను షేర్ చేస్తూ, “ఈసారి మామూలుగా ఉండదు. ముందుకు వెళ్లడమే తప్ప వెనక్కి చూడాల్సిన అవసరం లేదు” అని క్యాప్షన్ ఇచ్చారు. షానీల్ డియో దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ దర్శక, నటుడు అనురాగ్ కశ్యప్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇది ఆయన తెలుగు తెరపై నటిస్తున్న తొలి సినిమా. తొలుత హీరోయిన్గా శ్రుతిహాసన్ ఎంపికయినా, ఇప్పుడు మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రథమంగా డిసెంబరు 25న విడుదల చేయనుందని వెల్లడించిన సినిమా, తాజాగా వాయిదా పడింది.




















