హాంకాంగ్ సూపర్ సిక్సెస్‌లో భారత్, పాక్‌ల మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. డక్‌వర్త్-లూయిస్ విధానంలో భారత్ 2 పరుగుల తేడాతో పాక్‌పై ముందంజను సాధించు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 6 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. రాబిన్ ఉతప్ప 28 పరుగులు (11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), భరత్ చిప్లి 24 పరుగులు (13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేసి జట్టు రాణించారు. స్టువర్ట్ బిన్నీ 4, అభిమన్యు మిథున్ 6 పరుగులు సాధించగా, దినేశ్ కార్తిక్ 17* పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో మహ్మద్ షెహజాద్ 2, అబ్దుల్ సమద్ 1 వికెట్ పడగొట్టారు.
తరువాత 87 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాక్ మూడు ఓవర్ల తర్వాత వరుణుడు ఆటను ఆపడంతో, 1 వికెట్ కోల్పోయి 41 పరుగుల వద్ద ఆట నిలిచింది. డక్‌వర్త్-లూయిస్ విధానం ప్రకారం టీమ్‌ఇండియా 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం ఆగినప్పుడు ఖవాజా నఫే 18* (9 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్స్‌లు), అబ్దుల్ సమద్ 16* (6 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉండగా, మాజ్ సదఖత్ 7 పరుగులకు పెవిలియన్‌కు వెళ్లాడు. భారత బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ ఒక్క వికెట్ తీశాడు.




















