ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన రైతు ముత్యాల రజిత రమేష్ వేసిన మిరప తోటలో ఓ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఒకే మొక్కపై వంగ, మిరప, టమాటా కాయలు కాయడం విశేషంగా మారింది. ఈ వార్త వైరల్ కావడంతో సమీప గ్రామాల ప్రజలు ఆ వింత మొక్కను చూడటానికి తరలివస్తున్నారు. ఈ ఘటనపై జగ్గయ్యపేట డివిజన్ ఉద్యానశాఖ అధికారి బాలాజీ మాట్లాడుతూ, మొక్కలో జరిగిన జన్యుపరమైన మార్పుల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడి ఉండొచ్చని తెలిపారు. వంగ, మిరప, టమాట మూడు “సోలనేసీ” వృక్ష కుటుంబానికి చెందినవని, అందువల్ల ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి పరిణామం సంభవించవచ్చని వివరించారు.



















