ఓ వివాహానికి హాజరైన కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు స్విమ్మింగ్‌లో మునిగి మృతి చెందిన సంఘటన సోమవారం మడకశిరలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం హాసన్‌కు చెందిన బాబ్జాన్(35) మున్వర్ బాషా(27) మడకశిరలో ఆదివారం జరిగిన తమ బంధువుల వివాహానికి హాజరయ్యారు.
మడకశిర(అనంతపురం): ఓ వివాహానికి హాజరైన కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు స్విమ్మింగ్‌లో మునిగి మృతి చెందిన సంఘటన సోమవారం మడకశిరలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం హాసన్‌కు చెందిన బాబ్జాన్(35) మున్వర్ బాషా(27) మడకశిరలో ఆదివారం జరిగిన తమ బంధువుల వివాహానికి హాజరయ్యారు. పెళ్లి కార్యక్రమం ముగిసిన మరుసటి రోజు
అక్కడ యువకులతో పాటు బంధువులు సరదాగా దాదాపు గంటసేపు ఈత కొట్టారు. బంధువుల్లో చాలా మంది స్మిమ్మింగ్‌పూల్ నుంచి బయటకు వెళ్లిపోయినా బాబ్జాన్, మున్వర్‌బాషా అలాగే ఈత కొడుతూ ఉండిపోయారు. అయితే ఉన్నట్లుండి ఇద్దరూ మునిగిపోయారు. అక్కడే ఉన్న బంధువులు ఇది గమనించి, సరదాగా మునిగారేమోనని మిన్నకుండిపోయారు. ఐదారు నిమిషాలు గడిచినా బయటకు రాకపోవడంతో వారు స్మిమ్మంగ్‌పూల్‌లోకి దిగి ఇద్దరినీ బయటకు తెచ్చారు.




















