సియా కప్ 2025 ట్రోఫీ వివాదాన్ని పరిష్కరించడానికి ఐసీసీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. శుక్రవారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసియా కప్ విజేతగా నిలిచిన టీమ్ ఇండియా ట్రోఫీని ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా స్వీకరించడాన్ని నిరాకరించగా, భారత్ ఆటగాళ్ల చేతుల్లోకి ట్రోఫీ వచ్చేలా చేయాలని నఖ్వీ పంతం నిరాకరించడంతో వివాదం ముదిరింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఐసీసీ సమావేశంలో ప్రస్తావించింది. ప్రతిష్టా పరమైన ఈ సమస్యను తొలగించేందుకు ఐసీసీ మధ్యవర్తిత్వం చేస్తుందన్న అంగీకారం తెలిపింది.
వివాద పరిష్కార కమిటీని ఒమన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ పంకజ్ ఖిమ్జీ నేతృత్వంలో ఏర్పాటు చేశారు, ఈ కమిటీ బీసీసీఐ, పీసీబీ రెండింటితోనూ సత్సంబంధాలను కలిగి ఉంది. ఐసీసీ బోర్డు సమావేశానికి పది రోజుల ముందు బీసీసీఐ నఖ్వీకి లేఖ రాసి ట్రోఫీని భారత జట్టుకు ఇవ్వమని అభ్యర్థించగా, నవంబర్ 10న దుబాయ్‌లో ప్రత్యేక కార్యక్రమంలో ట్రోఫీ ఇవ్వమని నఖ్వీ పేర్కొన్నారు. బీసీసీఐ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. ఫైనల్ ముగిసిన వెంటనే ట్రోఫీ నేరుగా భారత్ జట్టుకి ఇవ్వమని బీసీసీఐ కార్యదర్శి సైకియా స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో ఐసీసీ మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించనుంది.




















