ప్రఖ్యాత ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే గ్లోబల్ ఏఐ కంపెనీ ఓపెన్‌ఏఐ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచింది. దీని ద్వారా చాట్‌జీపీటీ సేవలను మరింత వినియోగదారుల వరకు చేరవేసి, ఇరు కంపెనీల పరస్పర వృద్ధికి మద్దతు ఇవ్వనున్నారు. ఫోన్‌పే ప్రకటన ప్రకారం, ఈ భాగస్వామ్యం ద్వారా యూజర్లు ఫోన్‌పే ప్లాట్‌ఫామ్‌లో చాట్‌జీపీటీ ఆధారిత అధునాతన ఏఐ అనుభవాన్ని పొందగలరని తెలిపింది. ఫోన్‌పే రోజువారీ ట్రావెల్, షాపింగ్ వంటి సేవలను మరింత స్మార్ట్‌గా మార్చే అవకాశం కలిగిందని వెల్లడించింది.
ఈ భాగస్వామ్యంతో, చాట్‌జీపీటీ ఫోన్‌పే కన్జ్యూమర్ యాప్, ఫోన్‌పే బిజినెస్ యాప్, అలాగే ఇండస్ యాప్‌స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. ఫోన్‌పే ప్రకటనలో, దీని ద్వారా ఏఐ వినియోగం పెరుగుతుందని పేర్కొనబడింది. ఫోన్‌పే చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రాహుల్ చారి, ఓపెన్‌ఏఐ వంటి కంపెనీతో జట్టు కట్టడం ఆనందంగా ఉందని, అత్యధునిక సాంకేతిక అనుభవాన్ని వినియోగదారులకు అందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడతుందని తెలిపారు. ఓపెన్‌ఏఐ ఇంటర్నేషనల్ హెడ్ ఓలీవర్ జే, ఈ భాగస్వామ్యం వారి ఏఐ మిషన్‌లో మరో కీలక మైలురాయిని చేరుకునే అవకాశం కలిగిందని అన్నారు.




















