థియేటర్‌లలో ఘన విజయాన్ని సాధించి, బాక్స్‌ఆఫీస్ వద్ద కలెక్షన్‌ల వర్షం కురిపించిన సినిమాలు ఓటీటీ వేదికలపై కూడా సత్తా చాటుతున్నాయి. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌హిట్‌గా నిలిచిన ‘కాంతార చాప్టర్ 1’ మరియు ‘కొత్తలోక’ ఓటీటీల్లోనూ భారీ ఆదరణను సొంతం చేసుకున్నాయి. మీడియా సంస్థ ఆర్మాక్స్ ఇటీవల ఓటీటీ వేదికల్లో అత్యధిక వీక్షణలను సాధించిన చిత్రాల జాబితాను విడుదల చేసింది. గత రెండు వారాల వీక్షణల ఆధారంగా ఈ జాబితా రూపొందించబడిందని పేర్కొంది.
ఆర్మాక్స్ ప్రకారం, అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 31న స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ 4.1 మిలియన్ల వ్యూస్‌తో టాప్‌లో నిలిచింది. మలయాళంలో సంచలనం సృష్టించి తెలుగులోనూ ఆదరణ పొందిన ‘కొత్తలోక: చాప్టర్ 1’ జియో హాట్‌స్టార్‌లో రెండు వారాల్లో 4 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసి రెండో స్థానంలో నిలిచింది. 3.1 మిలియన్ల వ్యూస్‌తో ‘మిరాయ్’ (జియో హాట్‌స్టార్) మూడో స్థానంలో ఉంది. 2.4 మిలియన్ల వ్యూస్‌తో ‘ఇడ్లీ కొట్టు’ (నెట్‌ఫ్లిక్స్) నాలుగో స్థానంలో నిలిచింది. టైగర్ ష్రాఫ్ నటించిన ‘బాఘీ 4’ (అమెజాన్ ప్రైమ్) 2 మిలియన్ల వ్యూస్‌తో ఐదో స్థానంలో ఉంది.




















