క్వెట్టాలో మంగళవారం పేలుడు చోటుచేసుకున్న ప్రాంతంలో తునాతునకలైన పలు వాహనాలు
కరాచీ: పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరం మంగళవారం భారీ పేలుడుతో దద్దరిల్లింది. ఆ వెంటనే కాల్పుల మోత వినిపించింది. ఫ్రాంటియర్ కోర్ కేంద్ర కార్యాలయం సమీపంలో రద్దీగా ఉండే వీధిలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. పారామిలిటరీ సిబ్బంది లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 10 మంది మృతి చెందగా 32 మంది గాయపడ్డారని బలోచిస్థాన్ ఆరోగ్య మంత్రి బఖ్త్ ముహమ్మద్ కకర్ తెలిపారు. ఇది ఉగ్రవాదుల ఘాతుకమేనని బలోచిస్థాన్ ముఖ్యమంత్రి మిర్ సర్ఫ్రాజ్ బుగటి పేర్కొన్నారు.




















