తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి సేవల ఫిబ్రవరి నెల కోటా టికెట్లు ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయని టిటిడీ ప్రకటించింది. భక్తులు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా సేవా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
ఆర్జిత సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ లక్కీడిప్ ద్వారా కేటాయించబడతాయి. లక్కీడిప్ రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్ ద్వారా ఎంపికైన భక్తులు 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటలలోపు టికెట్ ఫీజు చెల్లించాలి.
కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, సాలకట్ల తెప్పోత్సవం సేవల టికెట్ల కోటాను 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
వర్చువల్ సేవలు మరియు వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి వస్తుంది.
అంగప్రదక్షిణ టోకెన్లు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు,
శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు 24న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి.
వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటా 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అవుతుంది.
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు,
తిరుమల–తిరుపతి అద్దె గదుల బుకింగ్ కోటా మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో జారీ అవుతుంది.
భక్తులు TTD అధికారిక వెబ్‌సైట్‌లోనే ఆర్జిత సేవలు మరియు ఇతర సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టిటిడీ విజ్ఞప్తి చేసింది.




















