రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి తీసుకుంటున్న ప్రయత్నాలు ఫలితం చూపకపోవడంతో, రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ సుంకాలను విధిస్తున్నట్లు తెలిసింది. తాజా ప్రకటనలో ట్రంప్ మాట్లాడుతూ, మాస్కోతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమని, ఈ చర్యలో రష్యాతో వ్యాపారం చేసే దేశాల ఉత్పత్తులపై 500 శాతం టారిఫ్‌లు విధిస్తానని తెలిపారు.
ఈ జాబితాలో భారత్, చైనా దేశాలు ఉన్నాయి. అలాగే ఇరాన్‌ను కూడా చేర్చనున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ, ఉక్రెయిన్‌కు సహాయం చేయని దేశాల ఉత్పత్తులపై ఈ భారీ సుంకం విధించబడనుంది. ట్రంప్ ప్రకారం, భారత్, చైనా మాత్రమే రష్యా నుంచి సుమారు 70 శాతం చమురు కొనుగోలు చేస్తున్నాయి.
ఈ బిల్లు అమలు అయితే, రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఔషధాలు, వస్త్రాలు, ఇతర ఎగుమతులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ బిల్లును రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ప్రతిపాదించారు.
ట్రంప్ తెలిపినట్టు, రష్యాకు కఠిన చర్యలు తీసుకోవడం తప్ప మరొక మార్గం లేదని, ఉక్రెయిన్‌పై యుద్ధం ముగింపు కోసం రష్యా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తే, మాస్కోతో వ్యాపారం చేసే దేశాలపై టారిఫ్‌ల తగ్గింపు చర్యలు తీసుకోవచ్చని కూడా తెలిపారు.




















