ఇంటర్నెట్ డెస్క్: రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాంతార:చాప్టర్1’ (Kantara Chapter 1). ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబరు 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా రెబల్ ట్రాక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘ఆది నుంచి నింగి, నేల ఉన్నాయంట ఈడే’ అంటూ సాగే పవర్‌ఫుల్ లిరిక్స్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను తెలుగులో కాలభైరవ పాడగా.. హిందీలో దిల్జిత్ దోసాంజ్ ఆలపించారు.




















