కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పు నిర్ణయాలు మరియు సీసీఐ తుగ్లక్ విధానాల కారణంగా పత్తి రైతులు భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐ ప్రకటించిన ఎల్1, ఎల్2, ఎల్3 విధానాల వల్ల గత రెండు రోజులుగా సీసీఐ, ప్రైవేట్ పత్తి కొనుగోళ్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీశ్‌రావు పార్టీ నాయకులతో కలిసి వరంగల్ ఎనుమాముల మార్కెట్‌ను సందర్శించారు. యాప్‌లో స్లాట్ బుకింగ్ నిబంధనను, ఎకరానికి 7 క్వింటాళ్ల కొనుగోలు పరిమితిని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


















