భారతీయుల కోసం ఇరాన్‌లో వీసా రహిత ప్రయాణం ఆగుతోంది. ఇరాన్ ప్రభుత్వం ఈ సదుపాయాన్ని నవంబర్ 22 నుండి నిలిపివేస్తుందని ప్రకటించింది. దీనికి అనుగుణంగా కేంద్రం భారతీయుల కోసం ప్రత్యేక సావధాన సూచనలు జారీ చేసింది. ఇరాన్ వెళ్లే వారు దోపిడీలు, కిడ్నాప్‌లు వంటి ప్రమాదాలకు గురవకుండా జాగ్రత్తగా ఉండాలని, ఉపాధి కల్పిస్తామని తప్పుడు హామీలు ఇచ్చే ఏజెంట్లతో వ్యవహరించవద్దని హెచ్చరించింది.
2023లో భారతీయులకు ఇరాన్‌లో 15 రోజులు వీసా లేకుండా పర్యటించడానికి అవకాశం ఉండగా, ఇకపై వెళ్ళేవారు ముందుగా వీసా కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కేంద్ర విదేశాంగశాఖ పర్యాటకులు, ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.



















