ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. ఇప్పటికే పలుసార్లు ఈ కేసులో కేటీఆర్ ఏసీబీ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఫార్ములా ఈ రేసింగ్‌కు సంబంధించి రూ.54.88 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ఏసీబీ గతంలో గవర్నర్ కార్యాలయానికి లేఖ పంపింది. ఆయన పాత్రపై తగిన ఆధారాలు ఉన్నాయని ఆ లేఖలో పేర్కొంది. తాజాగా గవర్నర్ అనుమతి మంజూరు చేయడంతో, ఈ కేసులో త్వరలోనే ఏసీబీ ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుంది.


















