శ్లాబ్ సామగ్రి మోసుకెళ్లే క్రేన్ కూలి ఘటనలో ఆంగ్ల ఉపాధ్యాయురాలు జోష్నా భాయ్ (45) ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలోని రాజానగరం ఉన్నత పాఠశాలలో శుక్రవారం పాఠశాల ఆవరణలో కళావేదిక నిర్మాణం జరుగుతుండగా, శ్లాబ్ సామగ్రిని పైభాగానికి తరలిస్తున్న క్రేన్ కూలింది. ఈ సమయంలో ఉపాధ్యాయురిపై సామగ్రి పడింది. గాయపడిన ఆమెను వెంటనే తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, మార్గమధ్యలోనే ఆమె మృతి చెందారు.
ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తూ, ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. అనిత ప్రభుత్వం అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించి, సంఘటనపై విచారణకు ఆదేశించారు.



















