‘ఉద్భవ్-2025’ పేరుతో డిసెంబర్‌లో ఏపీలో జాతీయ స్థాయి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ మరియు లోగోను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ స్థాయి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
‘‘డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో వైభవంగా పోటీలు నిర్వహిస్తున్నాం. 22 రాష్ట్రాల నుండి 1,800 మంది విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడమే ఈ పోటీల ముఖ్య లక్ష్యం. కేఎల్ యూనివర్సిటీలో 12 వేదికలు ఏర్పాటు చేసి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం’’ అని సంధ్యారాణి తెలిపారు.



















