పరకామణి చోరీ కేసు విచారణ బుధవారం విజయవాడలో నిర్వహించబడుతోంది. తిరుపతి నుంచి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ మంగళవారం రాత్రి విజయవాడకు చేరుకున్నారు. అప్పటి ఈవో ధర్మారెడ్డి, సీవీ అండ్ ఎస్‌వో నరసింహ కిషోర్ కూడా విచారణకు హాజరయ్యారు. గురువారం విచారణకు అప్పటి తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజయవాడకు రానున్నారు. తిరుపతిలో జరిగిన మీడియా హడావుడి నేపథ్యంలో ఈ విచారణను విజయవాడకు మార్చినట్లు సమాచారం.



















