ముగ్గురు అన్నదమ్ములు ఇల్లు శుభ్రం చేసుకుంటున్న సమయంలో, అటక మీద వేసి ఉంచిన ‘సూపర్‌మ్యాన్’ కామిక్స్ పుస్తకం మొదటి సంచిక ఈ నెల టెక్సాస్‌లో జరిగిన వేలంలో రికార్డు స్థాయిలో 9.12 మిలియన్ డాలర్లు (రూ.81.25 కోట్లు)కు విక్రయమైంది. వారి దివంగత తల్లి ఇల్లు శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉండగా, ఇంటి దుమ్మును తుడిచేస్తుండగా పాత వార్తాపత్రికల మధ్య కార్డుబోర్డులో ఈ విలువైన పుస్తకం కనుగొనబడింది. ఒక కామిక్స్ పుస్తకానికి ఇంత పెద్ద ధర పలకడం ఇదే తొలిసారి. అలాగే, రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభ కాలం నాటి మరికొన్ని పాత కామిక్స్ పుస్తకాలు కూడా ఆ కార్డుబోర్డులో దొరికాయి.




















