ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh) సందడి ప్రారంభం కానుంది. తొలి పాట త్వరలో రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటిస్తూ, ప్రత్యేక మేకింగ్ వీడియోని పంచింది. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డ్యాన్స్ చేస్తూ, నవ్వుతూ కనిపించారు. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత పవన్-డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా కారణంగా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు.




















