ఇప్పటికే ‘మీసాల పిల్ల’ పాటతో సోషల్ మీడియాను కుదిపేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’, ఇప్పుడు కొత్తగా ‘శశిరేఖ’ సాంగ్‌తో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి “పండగకి వస్తున్నారు” అనే ట్యాగ్‌లైన్‌ను జత చేశారు.
నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ నుంచి రెండో పాట ‘శశిరేఖ’ ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. మొత్తం పాట డిసెంబర్ 8న రానుండగా, ఈ చిత్రం వచ్చే సంవత్సరం సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.




















