తమిళనాడులోని కొడైకెనాల్‌లో కురిసిన మంచు ప్రకృతి అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. కొండలపై కప్పేసిన మంచు పాలకడలిలా మెరిసి చూపరులను ఆకట్టుకుంటోంది. సూర్యోదయం వేళ వాతావరణం మరింత ఆహ్లాదాన్ని పంచుతూ, అక్కడికి వచ్చిన వారికి మరపురాని అనుభూతిని అందిస్తోంది.




















