కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం గోవింద నామస్మరణతో మార్మోగుతోంది. ధనుర్మాసం తొలి శనివారం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.భక్తులు సంప్రదాయంగా ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లిస్తున్నారు. క్యూలైన్లు పూర్తిగా నిండిపోవడంతో దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తున్నారు.



















