తన తొలి నాయికా ప్రాధాన్య చిత్రం *‘ది గర్ల్‌ఫ్రెండ్’తో మరొక విజయాన్ని సాధించిన రష్మిక, ఇప్పుడు *‘మైసా’**తో రెండో నాయికా ప్రధాన చిత్రంగా తెర మీద అలరిస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా రవీంద్ర పుల్లె దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. బుధవారం విడుదలైన ఫస్ట్‌గ్లింప్స్‌లో, తల్లి సంభాషణలో “నా బిడ్డ సచ్చిందన్నారు… కానీ చావే చచ్చిపోయింది” అనే శక్తివంతమైన డైలాగ్ ద్వారా రష్మికను యాక్షన్ గెటప్‌లో పరిచయం చేశారు.ఈ సినిమాలో ఆమె గోండు తెగకు చెందిన వీరనారిగా, అటవీ నేపథ్యంతో, కొత్త లుక్‌లో ప్రేక్షకులను ఆకట్టనుంది. హై యాక్షన్‌తో, బలమైన భావోద్వేగాలతో నిండిన ఈ థ్రిల్లర్ వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్య పాత్రల్లో ఈశ్వరీరావు, రావు రమేశ్, గురు సోమసుందరం కనిపిస్తారు. సినిమాకు సంగీతం: జేక్స్ బిజోయ్, ఛాయాగ్రహణం: శ్రేయాస్ కృష్ణ.




















