ఒక ఊరంతా “పవునుతాయి వస్తోంది… పరుగెత్తండి!” అంటూ హడావుడి చేసుకుంటుంది. ఈ పవునుతాయి ఎవరు? ఎందుకు వసూలు చేస్తుంది కలెక్షన్లు? అసలు కథ “తాయి కిళవి”లోనే తెలుస్తుంది.రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో, శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. హీరో శివ కార్తికేయన్ సొంత నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి టీజర్ ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల అయింది. రాధికా శరత్‌కుమార్ పవునుతాయి అనే రుణాలిచ్చే వృద్ధురాలిగా సరికొత్త లుక్‌లో, వినూత్నమైన అవతారంలో ప్రేక్షకులను ఆకట్టారు. ఫిబ్రవరి 20న థియేటర్లలో సందడి చేస్తుంది.




















